ఆ ఐదెకరాలు అక్కరలేదు
అయోధ్య తీర్పు తమను నిరాశపర్చిందని సున్నీ వక్ఫ్ బోర్డు తెలిపింది. అయితే సుప్రీంకోర్టు తీర్పును తాము గౌరవిస్తున్నామని పేర్కొంది. కానీ తమకు మసీదు నిర్మాణం కోసం ఐదు [more]
;
అయోధ్య తీర్పు తమను నిరాశపర్చిందని సున్నీ వక్ఫ్ బోర్డు తెలిపింది. అయితే సుప్రీంకోర్టు తీర్పును తాము గౌరవిస్తున్నామని పేర్కొంది. కానీ తమకు మసీదు నిర్మాణం కోసం ఐదు [more]

అయోధ్య తీర్పు తమను నిరాశపర్చిందని సున్నీ వక్ఫ్ బోర్డు తెలిపింది. అయితే సుప్రీంకోర్టు తీర్పును తాము గౌరవిస్తున్నామని పేర్కొంది. కానీ తమకు మసీదు నిర్మాణం కోసం ఐదు ఎకరాలను కేటాయించాలని సుప్రీకోర్టు తీర్పు చెప్పిందని, తమకు ఐదు ఎకరాల స్థలం అక్కరలేదని సున్నీ వక్ఫ్ బోర్డు తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పుపై న్యాయనిపుణులను సంప్రదిస్తున్నామని పేర్కొంది. ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా స్పందించింది. సుప్రీంకోర్టు తీర్పులో తమకు కొన్ని అనుమానాలున్నాయని, మరోసారి పరిశీలించాల్సిందిగా సుప్రీంకోర్టును అభ్యర్థిస్తామని ముస్లిం పర్సనల్ లా బోర్డు తెలిపింది.