రాఫెల్ డీల్ పై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం వెనుక అక్రమాలు జరిగాయని, రాఫెల్ ఒప్పందం వివరాలు వెల్లడించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారణ జరిపించింది. రాఫెల్ రాఫెల్ ఒప్పందం వివరాలను సీల్డ్ కవర్ లో ఈ నెల 29లోగా కోర్టుకు అందజేయాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. యుద్ధ విమానాల ధరలు, ఒప్పందంలోని సాంకేతిక వివరాలు చెప్పాల్సిన అవసరం లేదని ధర్మాసరం పేర్కొంది. అవినీతి జరిగిందని చేస్తున్న ఆరోపణలను తాము పరిగణలోకి తీసుకోవడం లేదని కూడా కోర్టు స్పష్టం చేస్తూ తదుపరి విచారణను 31వ తేదీకి వాయిదా వేసింది.