ఆ ఎన్నికల్లో పోటీచేయం.. ప్రకటించిన టీడీపీ

కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ రెండో డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో తాము పాల్గొనడం లేదని టీడీపీ ప్రకటించింది. మరికాసేపట్లో ఈ ఎన్నిక జరగనుంది. 2017లో జరిగిన ఎన్నికల్లో కాకినాడ [more]

Update: 2021-08-04 04:41 GMT

కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ రెండో డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో తాము పాల్గొనడం లేదని టీడీపీ ప్రకటించింది. మరికాసేపట్లో ఈ ఎన్నిక జరగనుంది. 2017లో జరిగిన ఎన్నికల్లో కాకినాడ కార్పొరేషన్ లో టీడీపీ ఘన విజయం సాధించింది. 48 డివిజన్లలో 32 డివిజన్లలో టీడీపీ విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో వైసీపీ కేవలం పది డివిజన్లకే పరిమితమయింది. అయితే అధికారం పోవడంతో టీడీపీ కార్పొరేటర్లు సయితం అధికార పార్టీ వైపు చూస్తున్నారు. ఎన్నికల్లో పాల్గొంటే తమ కార్పొరేటర్లు అధికార పార్టీకి నేరుగా మద్దతుతెలిపే అవకాశం ఉందని భావించి టీడీపీ ఎన్నిక బరి నుంచి తప్పుకుంది. దీంతో రెండో డిప్యూటీ మేయర్ గా వైసీపీకి చెందిన కార్పొరేటర్ ఎన్నిక కానున్నారు.

Tags:    

Similar News