కుంభమేళాకు వెళ్లి వస్తే క్వారంటైన్

కుంభమేళా లో పాల్గొని వచ్చిన వారంతా కూడా తప్పనిసరిగా క్వారంటైన్ లో ఉండాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.. ఈ నెల 1వ తేదీ నుంచి [more]

Update: 2021-04-24 02:08 GMT

కుంభమేళా లో పాల్గొని వచ్చిన వారంతా కూడా తప్పనిసరిగా క్వారంటైన్ లో ఉండాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.. ఈ నెల 1వ తేదీ నుంచి 14వ తేదీ వరకు యూపీలో కుంభమేళా జరిగింది. దీనికి దాదాపు కొన్ని వేల మంది తెలంగాణ నుంచి వెళ్లి వచ్చారు. అయితే వారి నుంచి కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా హైకోర్టు కూడా ఈ మేరకు మేరకు కుంభమేళాకు వెళ్ళి వచ్చిన వారందరినీ హోం క్వారంటైన్ లో ఉంచేందుకు ఆదేశాలు ఇవ్వాలని హై కోర్టు ప్రభుత్వానికి చెప్పింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ నెల 1వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరిగిన కుంభమేళా లో పాల్గొని వచ్చిన వారంతా కూడా తప్పనిసరిగా హోమ్ క్వారంటైన్ లో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.

Tags:    

Similar News