బ్రేకింగ్ : సచివాలయం కూల్చివేత పనులకు బ్రేక్
తెలంగాణలో సచివాలయం కూల్చివేత పనులకు బ్రేక్ పడింది. సచివాలయం కూల్చివేత పనులను సోమవారం వరకూ నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. సచివాలయం కూల్చివేత పనులతో వాతవరణ కాలుష్యం ఏర్పడిందని [more]
తెలంగాణలో సచివాలయం కూల్చివేత పనులకు బ్రేక్ పడింది. సచివాలయం కూల్చివేత పనులను సోమవారం వరకూ నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. సచివాలయం కూల్చివేత పనులతో వాతవరణ కాలుష్యం ఏర్పడిందని [more]
తెలంగాణలో సచివాలయం కూల్చివేత పనులకు బ్రేక్ పడింది. సచివాలయం కూల్చివేత పనులను సోమవారం వరకూ నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. సచివాలయం కూల్చివేత పనులతో వాతవరణ కాలుష్యం ఏర్పడిందని హైకోర్టులో పిటీషన్ దాఖలయింది. కరోనా సమయంలోనూ కూల్చివేత సరికాదని, ప్రజారోగ్యంపై ప్రభావం పడుతుందని పిటీషనర్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో కూల్చివేతలను నిలిపేయాలని పిటీషనర్ కోరారు. అయితే కూల్చివేత పనులను పూర్తిగా ఆపివేయలేమని హైకోర్టు తెలిపింది. సోమవారం వరకూ మాత్రం కూల్చి వేత పనులు చేపట్టవద్దని సూచించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.