బ్రేకింగ్ : తెలంగాణాలో నైట్ కర్ఫ్యూ నేటి నుంచి

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1వ తేదీ వరకూ రాత్రి వేళ కర్ఫ్యూ విధించాలని నిర్ణయం తీసుకుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం [more]

Update: 2021-04-20 06:15 GMT

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1వ తేదీ వరకూ రాత్రి వేళ కర్ఫ్యూ విధించాలని నిర్ణయం తీసుకుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగనుంది. నైట్ కర్ఫ్యూ కారణంగా బార్ లు, పబ్ లు మూతపడనున్నాయి. అత్యవసర సర్వీసులకు మాత్రం నైట్ కర్ఫ్యూ నుంచి మినహాయింపులు ఇచ్చారు. హైకోర్టు నిన్న ఆదేశాలు జారీ చేయడంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలు సహకరించాలని ప్రభుత్వం కోరింది. ప్రయివేటు సెక్యూరిటీ సర్వీసులు, మెడికల్ షాపులు, ఆసుపత్రులకు మినహాయింపు ఇచ్చింది.

Tags:    

Similar News