చారిత్రాత్మిక బిల్లుకు ఆమోదం

ఆంద్రప్రదేశ్ లో జ్యుడిషియల్ కమిషన్ బిల్లుకు ఆమోదం పొందింది. ప్రాజెక్టులు ఏదైనా టెండర్లు పిలవడానికి ముందే న్యాయమూర్తి పరిశీలనకు పంపాలన్నది బిల్లు ఉద్దేశ్యం. న్యాయమూర్తి సిఫార్సు మేరకే [more]

Update: 2019-07-26 11:28 GMT

ఆంద్రప్రదేశ్ లో జ్యుడిషియల్ కమిషన్ బిల్లుకు ఆమోదం పొందింది. ప్రాజెక్టులు ఏదైనా టెండర్లు పిలవడానికి ముందే న్యాయమూర్తి పరిశీలనకు పంపాలన్నది బిల్లు ఉద్దేశ్యం. న్యాయమూర్తి సిఫార్సు మేరకే టెండర్లను ఆమోదిస్తారు. టెండర్లలో అవినీతి, అక్రమలను నిరోధించేందుకే ఈ బిల్లును ప్రవేశపెట్టారు. జాయింట్ వెంచర్లు, స్పెషల్ పర్సస్ వెహికల్ పనులను ఈ బిల్లులో పొందుపర్చారు. దీనిని చారిత్రాత్మకమైన బిల్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివర్ణించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అవినీనిత రూపుమాపి, పారదర్శకతను కల్పించడానికే ఈ బిల్లును తెచ్చినట్లు వైఎస్ జగన్ తెలిపారు. ఏ పని చూసినా అవినీతి కన్పిస్తుందని, చివరకు అసెంబ్లీ భవన నిర్మాణంలోనూ అవినీతి జరిగిందన్నారు. వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికే ఈ బిల్లును తెచ్చామని వైఎస్ జగన్ తెలిపారు. వందకోట్లకు పైగా విలువ ఉన్న ఏ పని అయినా సిట్టింగ్ జడ్జి పరిశీలనకు పంపుతామని వైఎస్ జగన్ తెలిపారు.

Tags:    

Similar News