‘టిక్ టాక్’ యాప్ తొలగించాలని ఆదేశం

యువతను ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘టిక్ టాక్’ యాప్ పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ యాప్ ను తమ ప్లేస్టోర్ల నుంచి తొలగించాలని గూగుల్, యాపిల్ [more]

Update: 2019-04-16 10:11 GMT

యువతను ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘టిక్ టాక్’ యాప్ పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ యాప్ ను తమ ప్లేస్టోర్ల నుంచి తొలగించాలని గూగుల్, యాపిల్ సంస్థలకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చింది. టిక్ టాక్ యాప్ వల్ల పిల్లలు సైబర్ నేరగాళ్ల బారిన పడే అవకాశం ఉన్నందున ఈ యాప్ పై నిషేదం విధించాలని మద్రాస్ హైకోర్టులో ఇటీవల పిటీషన్ దాఖలైంది. ఈ పిటీషన్ ను విచారించిన కోర్టు ఈ యాప్ ను నిషేధించాలని కేంద్రానికి ఆదేశాలు ఇచ్చింది. మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం ప్లేస్టోర్ల నుంచి ఈ యాప్ ను తొలగించాలని గూగుల్, యాపిల్ సంస్థలకు ఆదేశాలు ఇచ్చింది. ఇదిలా ఉండగా మద్రాస్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. స్టే ఇవ్వాలని చైనాకు చెందిన టిక్ టాక్ సంస్థ సుప్రీం కోర్టును ఆశ్రయించినా నిరాశే ఎదురైంది. స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది.

Tags:    

Similar News