మంత్రి పేర్ని నానితో ముగిసిన ఆర్జీవీ భేటీ.. ఏయే విషయాలపై చర్చించారు ?

కొద్దిసేపటి క్రితమే వీరిద్దరి భేటీ ముగియగా.. అనంతరం ఆర్జీవీ మీడియాతో మాట్లాడారు. భేటీలో చర్చించిన విషయాలను మీడియాకు

Update: 2022-01-10 11:08 GMT

ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానితో.. టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోమవారం మధ్యాహ్నం భేటీ అయిన సంగతి తెలిసిందే. కొద్దిసేపటి క్రితమే వీరిద్దరి భేటీ ముగియగా.. అనంతరం ఆర్జీవీ మీడియాతో మాట్లాడారు. భేటీలో చర్చించిన విషయాలను మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలపైనే మంత్రి పేర్నినానితో చర్చించినట్లు వర్మ చెప్పుకొచ్చారు. డిస్ట్రిబ్యూటర్ల తరఫునో.. నిర్మాతల తరఫునో మంత్రిని కలవలేదని స్పష్టం చేశారు.

ఏపీలో సినిమా టికెట్ల రేట్లను పెంచడంతో పాటు.. మరికొన్ని సమస్యలపై మంత్రితో చర్చించినట్లు వెల్లడించారు వర్మ. తానేమీ డిమాండ్లు చేయలేదు కానీ.. ఏ సమస్యను ఎలా పరిష్కరించాలన్నదానిపై తన అభిప్రాయాలను మంత్రికి తెలిపినట్లు వివరించారు. తన సూచనలను మంత్రి విన్నారని, ఈ భేటీపై తాను సంతృప్తి చెందానని ఆర్జీవీ పేర్కొన్నారు.
పరిశ్రమలో పవన్ కల్యాణ్ నో, బాలకృష్ణనో టార్గెట్ గా చేసుకుని.. ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని తాను భావించడం లేదని వర్మ చెప్పారు. అందరి సంక్షేమం దిశగానే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అలాగే ఈ ఒక్క సమావేశంతోనే అన్ని సమస్యలకు పరిష్కారం ఉండదని .. ఇది సిరీస్ ఆఫ్ డిస్కషన్ గా పేర్కొన్నారు. మరోసారి తాను మంత్రి పేర్నినానితో భేటీ అవ్వాల్సి ఉంటుందని వర్మ చెప్పకనే చెప్పారు.


Tags:    

Similar News