ఇక నీటి కష్టాలుండవు

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఇవ్వాళ భేటీ అయ్యింది. చైర్మైన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. తిరుమలలో శాశ్వత ప్రాతిపదికన నీటి [more]

Update: 2019-09-23 08:55 GMT

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఇవ్వాళ భేటీ అయ్యింది. చైర్మైన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. తిరుమలలో శాశ్వత ప్రాతిపదికన నీటి సమస్యను పరిష్కరించేందుకు బాలాజీ రిజర్వాయర్ నిర్మిస్తామని, అవిలాల ట్యాంక్ అభివృద్ధికి కేటాయించిన నిధులను బాలాజీ రిజర్వాయర్ నిర్మాణానికి మల్లించాలని సభ్యులు నిర్ణయించారు. టీటీడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు సబ్ కమిటిని నియమిస్తామని పాలక మండలి ఛైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. ఏపీ రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న శ్రీవారి ఆలయానికి గత ప్రభుత్వం కేటాయించిన రూ.150 కోట్లను ప్రస్తుత అవసరాల మేరకు రూ. 36 కోట్లకు కుదింపు చేసినట్లు చైర్మైన్ వైవి సుబ్బారెడ్డి వివరించారు.

 

Tags:    

Similar News