రూ.2 వేల నోటుకు ఏమైంది…??
కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్ల రద్దు తర్వాత రెండు వేల రూపాయల నోట్లను ప్రవేశపెట్టింది. అయితే రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓట్ల కొనుగోళ్లకు కళ్లెం వేయాలని కేంద్రం [more]
కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్ల రద్దు తర్వాత రెండు వేల రూపాయల నోట్లను ప్రవేశపెట్టింది. అయితే రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓట్ల కొనుగోళ్లకు కళ్లెం వేయాలని కేంద్రం [more]
కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్ల రద్దు తర్వాత రెండు వేల రూపాయల నోట్లను ప్రవేశపెట్టింది. అయితే రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓట్ల కొనుగోళ్లకు కళ్లెం వేయాలని కేంద్రం నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే రెండు వేల నోట్ల ముద్రణను రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా నిలిపేసిందని తెలుస్తోంది. రెండు వేల రూపాయల నోటు ఎన్నికల్లో కీలకంగా మారుతుందన్న సంకేతాలతో కేంద్ర ప్రభుత్వం ఆనోటును నిలిపేయాలని కేంద్రం ఆదేశించినట్లు తెలుస్తోంది. నల్లధనాన్ని కూడా పోగు వేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని కేంద్ర నమ్ముతోంది. అందుకే ముద్రణను నిలిపేయాలని కేంద్రం ఆదేశించినట్లు చెబుతున్నారు. రెండువేల నోటు ముద్రణ నిలిపేసినా అది బయట మార్కెట్ లో చెల్లుబాటు అవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం దేశంలో చెలామణి అవుతున్న నోట్లలో 37 శాతం రెండు వేల నోట్లు మాత్రమే కావడం గమనార్హం.