భారత్ నాలుగో టీం అవుతుందా..?

ఆదివారం భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య జరగనున్నక్రికెట్ మ్యాచ్ ఇరు జట్ల అభిమానులకు ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే రెండు జట్లు సెమీస్ లో బెర్త్ ఖరారు చేసుకున్నాయి. టాప్ రెండు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య పోటీ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Update: 2023-11-05 05:28 GMT

    ఆదివారం భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య జరగనున్నక్రికెట్ మ్యాచ్ ఇరు జట్ల అభిమానులకు ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే రెండు జట్లు సెమీస్ లో బెర్త్ ఖరారు చేసుకున్నాయి. టాప్ రెండు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య పోటీ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు రెండు జట్లు ఏడేసి మ్యాచ్ లు ఆడాయి. ఇండియా అన్ని మ్యాచ్ ల్లోనూ గెలిచి అజేయంగా నిలవగా, దక్షిణాఫ్రికా మాత్రం ఒక మ్యాచ్ లో ఓడిపోయింది. అది కూడా నెథర్లాండ్స్ చేతిలో ఓటమి పాలవడం విశేషం.

    ఆల్రెడీ సెమీస్ కు చేరుకోవడంతో ఆ టెన్షన్ అయితే రెండు టీం లకు లేదు. ఈ మ్యాచ్ లో గెలిస్తే భారత్ టీం మాత్రం మరో రికార్డు కి చేరువ అవుతుంది. ఒక్క మ్యాచ్ లోను ఓడిపోకుండా ప్రపంచ కప్ ని అందుకున్న టీంల  సరసన చేరవచ్చు. ఈ ఘనతను ఇప్పటి వరకు వెస్ట్ ఇండియన్, శ్రీలంక, ఆస్ట్రేలియా మాత్రమే సాధించాయి. శ్రీ లంక ఒకసారి ఈ అరుదైన రికార్డు ని అందుకోగా... వెస్ట్ ఇండీస్, ఆస్ట్రేలియా రెండేసి సార్లు సాధించడం విశేషం.

    1975, 1979 లలో జరిగిన మొదటి రెండు వరల్డ్ కప్ లలో వెస్ట్ ఇండీస్ టీం ఆటపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి అన్ని మ్యాచ్ ల్లోనూ గెలిచింది. కప్ ఎగరేసుకు పోయింది. ఆ డామినేషన్ కి 1983 లో భారత్ అడ్డుకట్ట వేసింది. మొదటి సారి ప్రపంచ కప్ గెలిచి మన దేశంలో క్రికెట్ ని ఓ మతంలా మార్చేసింది. ఆ తర్వాత 1996 లో శ్రీ లంక అనూహ్యంగా అన్ని మ్యాచ్ ల్లోనూ గెలిచి కొత్త ఛాంపియన్ గా అవతరించింది. మళ్ళీ ఆ ఫీట్ ని 2003, 2007 లో ఆస్ట్రేలియా సాధించింది. ఆడిన అన్ని మ్యాచ్ ల్లోనూ విజయం సాధించి నిజమైన ఛాంపియన్ గా నిలబడింది. మొత్తం ఐదు సార్లు ప్రపంచ కప్ ని గెలుచుకున్న రికార్డు కూడా ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. ఇక ఈ వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్ ల్లో గెలిచిన టీం ఇండియా, మిగిలిన వాటిలో కూడా గెలిచి భారత్ అభిమానులకు ప్రపంచ కప్ ని బహుమతిగా ఇస్తుందని ఆశిద్దాం. 

Tags:    

Similar News