ఆంధ్రప్రదేశ్ లో ఉప ఎన్నికలు రాకపోవడానికి కారణాలు తాము కారణం కాదన్నారు వైసీపీ నేత వైవై సుబ్బారెడ్డి, తాము ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారమే 14 నెలల ముందే రాజీనామాలు ఇచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. సున్నిత మైన అంశం కావడంతో స్పీకర్ వాటిని ఆలస్యంగా ఆమోదించారని చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ 6వ తేదీన ప్రత్యేక హోదా, విభజన హామీలపైనే తాము రాజీనామాలు చేశామని, తమను విమర్శిస్తున్న టీడీపీ నేతలు తమ పార్టీ నుంచి ఫిరాయించిన 23 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే ఏపీలో ఉప ఎన్నికలు వచ్చేవి కాదా? అని ప్రశ్నించారు. బుట్టారేణుకపై చర్యలు తీసుకోవాలని తాము ఫిర్యాదు చేశామని ఆమెపై చర్యలు తీసుకున్నా ఎన్నికలు వచ్చేవన్నారు. చంద్రబాబునాయుడుతో సహా టీడీపీ నేతలు తమపై చేస్తున్న విమర్శలకు అర్థం లేదని వైవీ అన్నారు. ఎన్నికలకు వైసీపీ ఎప్పుడూ భయపడదని, గత చరిత్ర చూస్తే అర్థమవుతుందన్నారు.