లాక్ డౌన్ తో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక?

సికింద్రాబాదులోని చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నారాయణ ( 22) అనే యువకుడు ఫ్యాన్ కి [more]

Update: 2020-04-25 12:25 GMT

సికింద్రాబాదులోని చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నారాయణ ( 22) అనే యువకుడు ఫ్యాన్ కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నారాయణ గచ్చిబౌలి లో ఒక హోటల్ లో రిసెప్షనిస్ట్ గా పని చేస్తున్నాడు, నారాయణ తల్లిదండ్రులు దేశబోయిన రామణయ్య( 45) డి. రంగమ్మ ( 40) ప్రకాశం జిల్లాలోని బేస్తవారిపేట (ఎం) గాలిజేరుగుల గ్రామానికి చెందినవారు. నారాయణ ఉద్యోగరీత్యా ప్రకాశం జిల్లా నుండి హైదరాబాద్ కు వచ్చి చిలకలగూడలో తన మేనమామతో కలిసి నివాసం ఉంటున్నాడు. గచ్చిబౌలి లో ఉన్న శ్రీ ఆడియా హోటల్‌లో రిసెప్షనిస్ట్ గా పని చేస్తున్నాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.లాక్ డౌన్ కారణంగా తన మామ ప్రసాద్ హోంగార్డు గా పని చేస్తాడు. మామ డ్యూటీ కి వెళ్ళిన తర్వాత మామ (ప్రసాద్) నారాయణకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయకపోవడంతో తన స్నేహితుడికి ఇంటి దగ్గరికి వెళ్లి చూడమని చెప్పాడు. దాంతో ప్రసాద్ స్నేహితుడు వెళ్లి ఎన్నిసార్లు డోర్ కొట్టినా కూడా నారాయణ తలుపులు తెరవకపోవడం తో అనుమానం వచ్చి పక్కింటి వాళ్లతో కలిసి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా నారాయణ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. లాక్ డౌన్ వల్ల ఆర్థిక ఇబ్బందులల కారణంగానే నారాయణ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని మామ తెలిపాడు. పోలీసులు మృతదేహం గాంధీ హాస్పత్రి కి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న చిలకలగూడా పోలీసులు.

Tags:    

Similar News