Ys jagan : హైకోర్టులో జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో?

తెలంగాణ హైకోర్టులో జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణ జరిగింది. హెటిరో డ్రగ్స్ అధినేత శ్రీనివాస రెడ్డి క్వాష్ పిటీషన్ పై విచారణ జరిగింది. అయితే [more]

Update: 2021-11-09 12:24 GMT

తెలంగాణ హైకోర్టులో జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణ జరిగింది. హెటిరో డ్రగ్స్ అధినేత శ్రీనివాస రెడ్డి క్వాష్ పిటీషన్ పై విచారణ జరిగింది. అయితే హెటిరో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి కి లబ్ది చేకూరేలా జగన్, విజయసాయిరెడ్డిలు ప్రయత్నించారని సీీబీఐ తరుపున న్యాయవాదులు వాదించారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ ను ఉపయోగించి ప్రయోజనాలను సమకూర్చారని సీబీఐ న్యాయవాదులు వాదించారు. హెటరో భూకేటాయింపులకు, జగతి పబ్లికేషన్స్ లో పెట్టుబడులకు సంబంధం ఉందని పేర్కొన్నారు. అతనిపై కేసును కొట్టివేయవద్దని సీబీఐ తరుపున న్యాయవాదులు కోరారు. హెటిరో డెరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి క్వాష్ పిటీషన్ పై ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేేసింది.

Tags:    

Similar News