ఆ బాధితురాలికి జగన్ ఆపన్న హస్తం

హైదరాబాద్ బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ పై నుండి దూకి వచ్చిన కారు ప్రమాద ఘటనలో ఒక యువతి అక్కడికక్కడే మరణించగా అనంతపురానికి చెందిన కుబ్రా బేగం [more]

;

Update: 2019-11-26 01:00 GMT
జగన్
  • whatsapp icon

హైదరాబాద్ బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ పై నుండి దూకి వచ్చిన కారు ప్రమాద ఘటనలో ఒక యువతి అక్కడికక్కడే మరణించగా అనంతపురానికి చెందిన కుబ్రా బేగం అనే మరో యువతి తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైంది. ప్రమాదం అనంతరం కుబ్రా బేగంను ఆసుపత్రిలో చేర్చగా ఆపరేషన్ నిమిత్తం 5లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారు. సాధారణ పెయింటర్ గా జీవనం సాగించే ఆ యువతి తండ్రి అబ్దుల్ అజీమ్ అంత డబ్బు చెల్లించే స్థోమత లేక సహాయం కోసం ఆసుపత్రి బయట దీనంగా ఎదురుచూస్తున్నాడు.

ఎంత ఖర్చయినా…..

మీడియాలో వచ్చిన లో వార్త చూసిన ఒక వ్యక్తి మనసు చలించి వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలియజేశారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి కుబ్రా బేగం ఆపరేషన్ కోసం సాయం చేయడానికి ముందుకొచ్చారు. ఎంత ఖర్చయినా పర్వాలేదు తక్షణమే ఆపరేషన్ కోసం కావలసిన డబ్బును ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందచెయ్యాలని అధికారులను జగన్ ఆదేశించారు. అలాగే ఆపరేషన్ తర్వాత కూడా యువతి తిరిగి సాధారణ స్థితికి చేరుకునేవరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

ఆపద్బాంధవుడిలా…..

తమ కూతురు ఆపరేషన్ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాయం చేయడానికి ముందుకొచ్చిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఉద్వేగానికి లోనయ్యారు. సాయం కోసం ఎదురుచూస్తూ దిక్కుతోచని స్థితిలో ఉన్న తమకు ఆపద్భాంధవుడిలా వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు.

Tags:    

Similar News