అది చేస్తే జగన్ ను అభినందిస్తా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తీసుకున్న నిర్ణయంపై హర్హాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరవు ఛాయలు ఉన్నందున బోర్లు వేయడానికి శాసనసభ్యుడికి కోటి [more]

Update: 2019-07-11 08:38 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తీసుకున్న నిర్ణయంపై హర్హాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరవు ఛాయలు ఉన్నందున బోర్లు వేయడానికి శాసనసభ్యుడికి కోటి రూపాయలు నిధులు మంజూరు చేస్తున్నట్లు శాసనసభలో ప్రకటించారు. కేవలం అధికార పార్టీ సభ్యులు మాత్రమే కాకుండా ప్రతిపక్ష సభ్యులకు కూడా ఈ నిధులను కేటాయిస్తామని వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి చెప్పారు. దీనికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రతిపక్ష శాసనసభ్యులకు అభివృద్ధి నిధులు ఇవ్వలేదని, తాము శాసనసభ్యులందరూ కలసి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిసినా కుదరదు పొమ్మన్నారని చెప్పారు. ఇప్పుడు వైఎస్ జగన్ అందరికీ నిధులు విడుదల చేస్తామని చెప్పడాన్ని చంద్రబాబునాయుడు అభినందించాలని కోరారు. అయితే చంద్రబాబునాయుడు ఒక ఎస్సీ ఎమ్మెల్యే కు జరిగిన అవమానంపై జగన్ క్షమాపణ చెబితే తాను జగన్ అభినందించడానికి రెడీగా ఉన్నానని చెప్పారు.

Tags:    

Similar News