జగన్ క్లాస్ పీకారు…!!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎమ్మెల్యేలకు క్లాస్ పీకారు. దాదాపు 70 మంది ఎమ్మెల్యేలు నూతనంగా ఎన్నికవ్వడంతో ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ శిక్షణ తరగతులకు [more]

Update: 2019-07-03 07:01 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎమ్మెల్యేలకు క్లాస్ పీకారు. దాదాపు 70 మంది ఎమ్మెల్యేలు నూతనంగా ఎన్నికవ్వడంతో ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ శిక్షణ తరగతులకు హాజరైన వై.ఎస్.జగన్ ఏదైనా విషయం మాట్లాడేటప్పడు దానిని పూర్తిగా అధ్యయనం చేయాలన్నారు. తాను గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఉదయం నాలుగు గంటలకే లేచి నోట్స్ ప్రిపేర్ చేసుకునేవాడినని చెప్పారు. సబ్జెక్ట్ పై పట్టు లేకపోతే నవ్వుల పాలు కావాల్సి వస్తుందని, ప్రతిపక్ష సభ్యులు తప్పులు వెతికే కార్యక్రమంలోనే ఉంటారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

హాజరు తప్పని సరి…..

సభ్యులకు కావాల్సిన పూర్తిసమాచారాన్ని పార్టీతరుపున అందిస్తామని వై.ఎస్.జగన్ చెప్పారు. వ్యక్తిగత దూషణలకు దిగి శాసనసభ పరువును బజారుకీడ్చొద్దని తెలిపారు. పూర్తి స్థాయి విశ్లేషణలతో అసెంబ్లీలో ప్రసంగించినప్పుడే ప్రజల మన్ననలను పొందగలుగుతామన్నారు. సభ్యులు విధిగా శాసనసభకు హాజరుకావాలని, ఏదైనా అత్యవసరమైతే తప్ప గైర్హాజరు కావద్దని సూచించారు. శాసనసభలో మన ప్రవర్తన అందరూ గమనిస్తుంటారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. సభకు హాజరుకాకపోవడానికి బలమైనకారణముండాలని ఆయన తెలిపారు. శాసనసభలో మాట్లాడునుకునే వారు ముందుగా చీఫ్ విప్, విప్ లవద్ద తమపేర్లను నమోదు చేయించుకోవాలన్నారు.

Tags:    

Similar News