చంపేస్తారనుకున్నాం… కంటతడి పెట్టిన ఎమ్మెల్యే

తనపై, తన భర్త పరీక్షిత్ పై ఎన్నికల రోజు తెలుగుదేశం పార్టీ నేతలు హత్యాయత్నం చేశారని, టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి [more]

;

Update: 2019-04-16 11:56 GMT
ramachandraiah comments on ncbn
  • whatsapp icon

తనపై, తన భర్త పరీక్షిత్ పై ఎన్నికల రోజు తెలుగుదేశం పార్టీ నేతలు హత్యాయత్నం చేశారని, టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి కోరారు. మంగళవారం ఆమె వైసీపీ నేతలతో కలిసి డీఐజీ, ఎస్పీలను ఆమె కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… రిగ్గింగ్ జరుగుతుందనే సమాచారంతో తాను, తన భర్త పోలింగ్ బూత్ వద్దకు వెళ్లగానే టీడీపీ నేత రామకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు తమపై దాడి చేశారన్నారు. తాము తప్పించుకొని ఒక గదిలో తలదాచుకుంటే బయటి నుంచి గొడ్డెళ్లు, కర్రలు, సుత్తెలతో డోర్లు పగలకొట్టి వచ్చి దాడి చేసేందుకు ప్రయత్నించారన్నారు. మూడు గంటల పాటు గదిలో బిక్కుబిక్కుమంటూ బతికామని, తామను చంపేస్తారనే అనుకున్నామని గుర్తు చేసుకొని ఆమె కంటతడి పెట్టారు. టీడీపీ నేత శత్రుచర్ల విజయరామరాజు తమపై దాడికి కుట్రదారు అని, ఆయనతో పాటు దాడికి పాల్పడ్డా వారిపై కఠిన చర్యలు తీసకోవాలన్నారు. ఒక మహిళా ఎమ్మెల్యేకే భద్రత లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. దాడి జరిగి ఐదు రోజులైనా ఇంకా పోలీసులు చర్యలు తీసుకోకపోవడం సరికాదన్నారు. నిందితులపై చర్యలు తీసుకునే వరకు న్యాయపరంగా పోరాడతామన్నారు.

Tags:    

Similar News