ఫీడ్ బ్యాక్ తీసుకుంటే ఓకే.. లేకుంటే?

వైసీపీ అధినేత జగన్ ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. పార్టీపై పూర్తి స్థాయి ఫోకస్ పెడుతున్నారు.

Update: 2022-07-24 03:04 GMT

వైసీపీ అధినేత జగన్ ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. పార్టీపై పూర్తి స్థాయి ఫోకస్ పెడుతున్నారు. మూడేళ్ల నుంచి పాలనపై దృష్టి పెట్టిన జగన్ ఇప్పుడు పార్టీని పూర్తి స్థాయిలో గాడిన పడేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఒకవైపు ఎమ్మెల్యేలను గడప గడపకు ప్రభుత్వం పై ఇప్పటికే రెండు దఫాలు వర్క్ షాప్ లు నిర్వహించారు. రెండు రోజుల క్రితం పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లతో సమావేశమయ్యారు. ఈ రెండు సమావేశాల్లో కొంత సీరియస్ గానే జగన్ నేతలకు దిశానిర్దేశం చేశారు. తొలుత నేతలను సరైన మార్గంలో పయనించేలా దిశా నిర్దేశం చేశారు.

కార్యకర్తలతో సమావేశంలో...
ఇక వచ్చే నెల నాలుగో తేదీ నుంచి కార్యకర్తలతో సమావేశం అవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం నియోజకవర్గానికి యాభై మంది కార్యకర్తలను ఎంపిక చేయనున్నారు. వారితో నేరుగా జగన్ ఇంట్రాక్ట్ అవ్వనున్నారు. నియోజకవర్గంలో పార్టీ పరంగ నెలకొన్న సమస్యల గురించి తెలుసుకోనున్నారు. అంతే కాకుండా కార్యకర్తలు వచ్చే రెండేళ్లు ఏం చేయాల్సి ఉంటుందో కూడా దిశా నిర్దేశం చేయనున్నారని తెలిసింది. కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమం కూడా ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మూడేళ్ల తర్వాత కార్యకర్తలతను జగన్ కలవనున్నారు.
తన ప్రసంగాలతోనే కాకుండా...
ిఅయితే జగన్ గతంలో జరిగిన ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో కాని, నియోజకవర్గాల ఇన్‌ఛార్జులతో జరిపిన మీట్ లో గాని వారికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. జగన్ తన వద్దకు వచ్చిన నివేదికల ప్రకారం సమావేశంలో పేర్కొన్నారు. వారిని ఉద్దేశించి ప్రసంగించారు. గడప గడపలో ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి వారిని అడిగి తెలుసుకోలేదు. అలాగే నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాల విషయంలోనూ ఇన్‌ఛార్జులను అడగలేదు. తాను చెప్పదలచుకున్న విషయాలను చెప్పి వెళ్లిపోయారు. ఎప్పటిలాగే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లామని కోరారు. సీరియస్ గా పనిచేయాలని సూచించారు. ఇన్ ఛార్జిగా పనిచేయాలని ఇష్టపడక పోతే కొత్త వారికి అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు.
వారి నుంచి...
అంతే తప్ప ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జుల నుంచి ఎటువంటి ఫీడ్ బ్యాక్ తీసుకోలేదు. రేపు కార్యకర్తల సమావేశంలో కూడా ప్రసంగానికే పరిమితమయితే పెద్దగా ఫలితం ఉండక పోవచ్చు. సమావేశానికి వచ్చేది కార్యకర్తలు కాబట్టి వారి నుంచి ఫీడ్ బ్యాక్ ను తీసుకునే ప్రయత్నం చేయాలి. కార్యకర్తలకు క్షేత్ర స్థాయిలో పరిస్థితులు తెలుస్తాయి. స్థానిక పరిస్థితులపై అవగాహన ఉంటుంది. వారు నిర్మొహమాటంగా పార్టీ పరిస్థితి గురించి చెప్పగలరు. అందుకే ఎప్పటిలాగే జగన్ ప్రసంగానికే పరిమితం కాకుండా క్యాడర్ నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటే వాస్తవ పరిస్థితి జగన్ కు తెలిసే అవకాశముంది. లేదంటే ఇలాంటి సమావేశాలు పెట్టినా వృధాయేనన్నది పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


Tags:    

Similar News