ఒక్కరోజు వైసీపీ ఎంపీల ఎన్నికను నిలిపేసిందే....!

Update: 2018-10-06 13:16 GMT

ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే, వీరి రాజీనామాలతో ఖాళీ అయిన స్థానాల్లో ఉపఎన్నికలు జరగవని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం సంవత్సరం లోపు పదవీకాలం మాత్రమే మిగిలి ఉంటే ఎన్నికలు నిర్వహించడానికి వీలు లేదు. రాజీనామా చేసిన ఎంపీల పదవీకాలం వచ్చే సంవత్సరం జూన్ 4న ముగియనుంది. కాగా, వీరి రాజీనామాలు ఈ సంవత్సరం జూన్ 3న ఆమోదం పొందాయి. దీంతో నిబంధనల ప్రకారం పదవీకాలం సంవత్సరం పైన 1 రోజు మాత్రమే ఉంది. దీంతో ఎన్నికల నిర్వహణ అవసరం లేదని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇక ఇటీవల ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మరణంతో ఖాళీ అయిన అరకు శాసనసభకు ఎన్నికలు ఉండవని స్పష్టం చేసింది.

Similar News