'ది ఫ్రేమ్' టీవీలను భారత్ లో లాంఛ్ చేసిన శాంసంగ్

Frame TV 43-అంగుళాల, 55-అంగుళాల, 65-అంగుళాల, 75-అంగుళాల స్క్రీన్ సైజ్ లలో వస్తుంది.

Update: 2022-10-01 07:28 GMT

శాంసంగ్ సంస్థ భారతదేశంలో అధికారికంగా 'ది ఫ్రేమ్' టీవీలను విడుదల చేసింది. ఫ్రేమ్ సిరీస్ లో వస్తున్న అప్డేటెడ్ మోడల్స్ ఇవని సంస్థ తెలిపింది. కొత్త QLED TV లైనప్ లో భాగంగా ఈ Samsung టీవీలు క్వాంటం ప్రాసెసర్ 4Kతో వస్తుంది. అంతేకాకుండా ఇందులో 4K AI అప్‌స్కేలింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. స్లిమ్ పిక్చర్ ఫ్రేమ్ లాగా కనిపించేలా ఈ టీవీ రూపొందించబడింది. అన్ని మోడల్‌లు 4K QLED డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. HDR10+, సుప్రీం UDH డిమ్మింగ్‌కు మద్దతు ఇస్తాయి. అంతేకాకుండా మాట్టే డిస్‌ప్లేతో వస్తుంది. Google Duoని ఉపయోగించి వీడియో కాలింగ్‌ కూడా చేసుకోవచ్చు. ట్రూ డాల్బీ అట్మోస్, ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్, స్పేస్‌ఫిట్ సౌండ్, ఐకాంఫర్ట్ మోడ్.. వంటి కొత్త ఫీచర్లను కూడా Samsung సంస్థ సరికొత్త ఫ్రేమ్ టీవీకి జోడించింది.

Frame TV 43-అంగుళాల, 55-అంగుళాల, 65-అంగుళాల, 75-అంగుళాల స్క్రీన్ సైజ్ లలో వస్తుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలోనే కాకుండా.. ప్రధాన ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లలో కూడా ఈ టీవీలు అందుబాటులో ఉంటాయి. Samsung అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌లో ఫ్రేమ్ టీవీని కొనుగోలు చేసే వారు ఎంపిక చేసిన బ్యాంకుల్లో 20 శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. Samsung Galaxy A32 మొబైల్ ను 75-అంగుళాల మోడల్‌తో.. Galaxy A03ని 65-అంగుళాల మోడల్‌తో ఉచితంగా అందిస్తోంది. వినియోగదారులకు మూడేళ్ల వారంటీని, అదనంగా 10 సంవత్సరాల స్క్రీన్ బర్న్-ఇన్ వారంటీని పొందుతారు.


Tags:    

Similar News