టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

జగన్‌ సర్వేలను నమ్మడం లేదా..?, మళ్లీ వైరస్ కలకలం.. ఎన్ఐఏ మోస్ట్ వాంటెండ్ జాబితాలో ముగ్గురు ఏపీ, తెలంగాణ యువకులు

Update: 2023-12-17 12:53 GMT

 latest telugu news

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

జగన్‌ సర్వేలను నమ్మడం లేదా..?

ఆంధ్రప్రదేశ్‌లో మరో మూణ్నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటివరకూ వెలువడిన సర్వేలన్నీ అధికార పార్టీయే మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని స్పష్టం చేస్తున్నాయి,. టైమ్స్‌ నౌ, ఈటీజీ సంస్థలు ఈ మధ్య జరిపిన సర్వేలో కూడా ఇదే విషయం వెల్లడైంది. ఇంతవరకూ ఏ పార్టీకి లేనంత విశ్వాసంతో జగన్‌ ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధమవుతోంది.

Vidadala Rajini : ఎందుకు తల్లీ అంత ... మనమేందో మనకు తెలియాలి కదా?

రాజకీయాల్లో ఎంత కష్టపడినా ఎదగని వారు అనేక మంది ఉంటారు. ఐదారుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయినా మంత్రి కాలేదన్న బాధ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనేక మంది రాజకీయనేతలకు ఉంది. అలాంటిది లక్కు కలసి వస్తే... తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టిన వాళ్లు కొందరే ఉన్నారు. వారిలో విడదల రజని ఒకరు.

New Variant : మళ్లీ వైరస్ కలకలం.. శానిటైజర్లు.. మాస్క్ లు వాడాల్సిందే

వైరస్ ఏది వచ్చినా ఫస్ట్ కేరళలోనే వెలుగులోకి వస్తుంది. కేరళలోనే ఎందుకు కొత్త వేరియంట్లు వెలుగు చూస్తుంటాయి? కేరళకు చెందిన వారు వివిధ దేశాలు, మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉపాధి నిమిత్తం వెళుతుంటారు. అక్కడినుంచి కొత్త వైరస్ లను మోసుకొస్తుంటారు. అందుకే ఏ వేరియంట్ వచ్చినా అది కేరళలోనే తొలుత రికార్డు కావడం అన్ని సార్లు జరుగుతుంది.

Sitakka : మంత్రి సీతక్క తొలిసారి ములుగుకు రావడంతో?

మేడారం సమ్మక్క-సారలమ్మను మంత్రి సీతక్క దర్శించుకున్నారు. మంత్రి అయ్యాక తొలిసారి ఆమె ములుగు ప్రాంతంలో పర్యటించారు. సీతక్క మంత్రిగా ములుగు వస్తుండటంతో పెద్దయెత్తున అభిమానులు చేరి ఆమెకు శుభాకాంక్షలు అందచేశారు. మంత్రిగా బాధ్యతలను తీసుకున్న వెంటనే తన సొంత ఊరికి కూడా ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని సీతక్క కల్పించారు.

చికెన్ ధర ఎంతో తెలుసా? తెలిస్తే.. సినిమాలో కోట శ్రీనివాసరావు అవ్వాల్సిందే

కార్తీక మాసం పూర్తి కావడంతో మాంసాహార ప్రియులు చికెన్ కొనుగోలుపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దీంతో చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. కార్తీక మాసంలో ఎక్కువ మంది మాంసాహారం తినకపోవడంతో చికెన్ ధరలు కొంత తక్కువగానే ఉన్నాయి. మొన్నటి వరకూ కిలో చికెన్ ధర 120 రూపాయలు మాత్రమే పలికింది.

India vs South Africa First Odi : బౌలర్లు.. బ్యాటర్లు ఏం ఆడారు... ఇరగదీశారు బాసూ

టీం ఇండియా సూపర్ విక్టరీ సాధించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో అద్భుతమైన విజయం సాధించింది. టీ 20 సిరీస్ ను సమం అయినా ఇప్పుడు వన్డేలలో మాత్రం టీం ఇండియా మాత్రం పైచేయి సాధించింది. అతి తక్కువ పరుగులకే దక్షిణాఫ్రికాను అవుట్ చేయడంతో అప్పుడే టీం ఇండియా విజయం ఖాయమయిందనే చెప్పాలి.

2023 Rewind : ఈ ఏడాది స్క్రీన్ పై కనిపించని హీరోలు వీరే..

ఈ ఏడాది టాలీవుడ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద ఇంపాక్ట్ చూపించలేకపోయాయి. ఒకరి ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చినా.. అవి పెద్దగా సత్తా చూపించలేకపోయాయి. ఇంతకీ అసలు ఈ ఏడాది ఆడియన్స్ ముందుకు రాని హీరోలు ఎవరు..? వచ్చినా పెద్ద సత్తా చూపలేని హీరోలు ఎవరు..?

Breaking : పబ్ లు మూయకపోతే.. ఇక అంతే.. సీపీ వార్నింగ్

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. పబ్ లు సమాయానికి మూసేయాలని ఆదేశించారు. లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమయానికి మించి ఏమాత్రం పబ్ లు నడిపినా చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. పబ్ లలో డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయని కొత్తకోట శ్రీనివాసరెడ్డి అన్నారు.

Breaking : ఎన్ఐఏ మోస్ట్ వాంటెండ్ జాబితాలో ముగ్గురు ఏపీ, తెలంగాణ యువకులు

ఎన్ఐఏ మోస్ట్ వాంటెండ్ జాబితాలో ముగ్గురు తెలంగాణ,పీ ఏపీకి చెందిన యువకులున్నారు. వారి కోసం నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు గాలిస్తున్నారు. ఎన్ఐఏ అధికారులు ఇటీవల పలు రాష్ట్రాలలో దాడులు జరిగిన నేపథ్యంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. అందులో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు కూడా ఉన్నారని ఎన్ఐఏ అధికారులు గుర్తించారు.

‍Nalgonda : తహసిల్దార్ ఇంట్లో కోట్ల రూపాయల నగదు... కిలోల కొద్దీ బంగారం

నల్లగొండ జిల్లాలోని తహసిల్దార్ ఇంట్లో ఏసీబీ దాడుల్లో అనేక విషయాలు బయటపడుతున్నాయి. కరెన్సీ కట్టలు బయటపడుతున్నాయి. నల్లగొండ జిల్లా మర్రిగూడ మహేందర్ రెడ్డి ఇంట్లో ఏసీబీ దాడులు జరిగాయి. అందిన సమాచారం మేరకు ఈ దాడులను ఏసీబీ అధికారులు నిర్వహించినట్లు చెబుతున్నారు.




















Tags:    

Similar News