నేడు విశాఖలో ముగ్గురి రోడ్ షో.. ఏర్పాట్లు పూర్తి

ఈరోజు విశాఖ పట్నంలో సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి చంద్రబాబు, పవన్ రోడ్‌షో నిర్వహించనున్నారు.;

Update: 2025-01-08 03:26 GMT

ఈరోజు విశాఖ పట్నంలో సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి చంద్రబాబు, పవన్ రోడ్‌షో నిర్వహించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం విశాఖకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రానున్నారు. మధ్యాహ్నం12 గంటలకు విశాఖ చేరుకోనున్న పవన్ కల్యాణ్ సాయంత్రం 4:15 గంటలకు ఐఎన్ఎస్ డేగాలో చంద్రబాబుతో కలిసి మోదీకి స్వాగతం పలకనున్నారు.

కిలోమీటరు మేరకు...
సాయంత్రం 5:30 గంటల నుంచి ప్రధాని మోదీ బహిరంగసభ జరగనుంది. ముగ్గురు కలసి దాదాపు కిలోమీటరు మేర విశాఖలో రోడ్ షో నిర్వహించనున్నారు. రోడ్ షో జరిగే ప్రాంతంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బహిరంగ సభ పూర్తయిన తర్వాత నేడు రాత్రి 7:25 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కల్యాణ్ గన్నవరం బయల్దేరనున్నారు.



ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now

 


Tags:    

Similar News