వైజాగ్ ఫుడ్‌ ఎక్స్‌ప్రెస్‌.. రైల్వే స్టేషన్‌లో సరికొత్త కోచ్ రెస్టారెంట్

విశాఖ ఒక పర్యటక ప్రదేశం. చాలా మంద టూరిస్టులు విశాఖ జిల్లాను తప్పకుండా సందర్శిస్తుంటారు. ఎంతో ఆహ్లాదకరమైన..

Update: 2023-10-05 03:40 GMT

విశాఖ ఒక పర్యటక ప్రదేశం. చాలా మంద టూరిస్టులు విశాఖ జిల్లాను తప్పకుండా సందర్శిస్తుంటారు. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రశాంతత గల ప్రదేశం. ఇక్కడ అందమైన బీచ్ లు, అద్భుతమైన పార్క్ లు, పచ్చదనం పరచుకున్న ఎత్తైన తూర్పు కనుమలు, లాంటి ప్రాంతాలు మనసును ఆహ్లాదపరుస్తాయి. పర్యాటక ప్రదేశాలు మాత్రమే కాదు ఇక్కడి తినుబండారాలు విశాఖ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు పరిమితమైన స్థానిక ఆహార రుచులు కూడా టూరిస్టులకు అంతే ప్రత్యేకంగా అనిపిస్తాయి. ప్రధానంగా విశాఖ లో లభించే సీ ఫుడ్‌కు భలే గిరాకీ. విశాఖ స్టార్ హోటల్స్ లో లభించే సీ ఫుడ్ ఆహారాన్ని పక్కన పెడితే విశాఖ స్థానిక హోటళ్లలో లభించే అథెంటిక్ ఫుడ్ కు విపరీతమైన గిరాకీ ఉంటుంది. అలాంటి విశాఖ అథెంటిక్ ఫుడ్ తినాలంటే ఇకపై విశాఖ నగర వీధుల్లో తిరగక్కర్లేదు. మీరు కానీ విశాఖ కు రైల్ లో వచ్చినా, లేదంటే ఏ రకంగా వచ్చినా ఒక్కసారి విశాఖ రైల్వే స్టేషన్‌కు వెళ్లారంటే చాలు మీకు ట్రైన్ కోచ్ లో నిర్వహిస్తున్న ఒక అందమైన రెస్టారెంట్ మనకు రుచికరమైన ఫుడ్ ను అందిస్తుంది. అరకు బొంగు చికెన్ నుంచి స్టఫడ్ క్రాబ్ వరకు మనకు ఆ విశాఖ కోచ్ ఎక్స్‌ప్రెస్‌లో అందుబాటులొ 24 గంటలూ ఉంటాయి

రైల్ కోచ్ లో ..

ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోని వాల్తేరు డివిజన్‌ రైల్వే అధికారులు విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో సరికొత్త రెస్టారెంట్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంతే రైల్వే స్టేషన్‌ ముందున్న బస్టాప్‌ దగ్గర చాలా స్థలం నిరుపయోగంగా ఉండేది. అక్కడే వైజాగ్‌ ఫుడ్‌ ఎక్స్‌ప్రెస్‌ పేరుతో ఒక రెస్టారెంట్ నిర్మించాలని భావించారు. మామూలు కాంక్రీట్ నిర్మాణం కాకుండా పాడైపోయిన ‘కోచ్‌' ను ఆధునీకరించి ఒక రెస్టారెంట్ ఏర్పాటు చేస్తే అందరినీ ఆకట్టుకుంటుందని నిర్ణయించారు. అంతే వేగంగా ఒక పాత రైలు కోచ్‌ను తీసుకువచ్చి, రెస్టారెంట్‌గా తీర్చిదిద్దారు. అందంగా తయారుచేశారు. ఇటీవల కాలంలో అందరినీ ఆకట్టుకుంటున్న మండీ రెస్టారెంట్ టైప్ లో మరొకదాన్ని కూడా ఏర్పాటు చేశారు.

24X7 అందుబాటులో..

ఈ కోచ్ రెస్టారెంట్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. అటు ప్రయాణీకులతో పాటు ఇటు నగర వాసులకూ ఇప్పుడు అదొక సరికొత్త డెస్టినేషన్. అర్థరాత్రి తర్వాత ఫుడ్ తినాలంటే నేరుగా రైల్వే స్టేషన్ కు వెళ్తే సరి.. కోచ్ రెస్టారెంట్ లో మనకు ఇష్టమైన పదార్థాలు అందుబాటులో ఉంటాయి. ఈ రెస్టారెంట్ 24x7 అందుబాటులో ఉంటుంది. మనం ఎప్పుడు వెళ్ళినా వేడివేడి ఆహార పదార్థాలను అందిస్తుంటారు. ఈ కోచ్ ను నిర్మించింది రైల్వే శాఖ అయినా నిర్వహణ బాధ్యతలను మాత్రం ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించారు. పాత కోచ్‌కు 15 లక్షల రూపాయలు వెచ్చించి తయారు చేసిన ఈ రెస్టారెంట్ కు ఏడాదికి 72 లక్షలు లైసెన్స్‌ ఫీజు నిర్ణయించారు. ఈ రెస్టారెంట్లు ను రైల్వే శాఖ సహాయ మంత్రి దర్శన విక్రమ్‌ జర్దోష్‌ చేతులు మీదుగా ప్రారంభించడం విశేషం.
Tags:    

Similar News