Warangal : వరంగల్ మార్కెట్ కు పత్తి, మిర్చి
వరంగల్ ఎనుమాముల మార్కెట్ కు పత్తి రైతులు ఎక్కువ సంఖ్యలో వచ్చారు. అలాగే మిర్చి రైతులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు;
వరంగల్ ఎనుమాముల మార్కెట్ కు పత్తి రైతులు ఎక్కువ సంఖ్యలో వచ్చారు. అలాగే మిర్చి రైతులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. వరస సెలవులు కావడంతో వరంగల్ లోని ఎనుమాముల యార్కెట్ కు ఒక్కసారిగా రైతుల రద్ద పెరిగింది. తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు మార్కెట్ కు చేరుకోవడంతో కొంత ట్రాఫిక్ రద్దీ కూడా ఏర్పాడింది.
పత్తి, మిర్చి పంటలను విక్రయించేందుకు...
తమ పంటల ఉత్పత్తులను విక్రయించుకునేందుకు చేరుకున్న రైతులు బస్తాలతో తరలి రావడంతో ఎనుమాముల మార్కెట్ సందడిగా మారింది. పత్తి, మిర్చి బస్తాలతో తరలి వచ్చిన రైతులు తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరుతున్నారు. రైతులు ఎక్కువ మంది తరలి రావడంతో అందుకు అవసరమైన ఏర్పాట్లను మార్కెట్ అధికారులు చేపట్టారు.