Mon Dec 23 2024 11:35:12 GMT+0000 (Coordinated Universal Time)
పేదల బడ్జెట్ ఇది : బుగ్గన
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో2023-24 సంవత్సరానికి బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టారు
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో2023-24 సంవత్సరానికి బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో సవాళ్లు, ప్రతికూలతలు ఉన్నా, విపత్తులు సంభవించినా బడ్జెట్ ను పేద ప్రజల బడ్జెట్ గా రూపొందించామని బుగ్గన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2023-౨౪ రూ. 2,79,279 కోట్ల రూపాయలతో ఈ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు.
కేటాయింపులు ఇలా...
1.మన బడి నాడు నేడు రూ.3,500 కోట్లు
2.పేదలందరికీ ఇళ్లు రూ.5,600 కోట్లు
3.పరిశ్రమలు, వాణిజ్యం రూ.2,602 కోట్లు
4.రోడ్లు, భవనాలు శాఖ రూ.9,118 కోట్లు
5.నీటి వనరుల అభివృద్దికి రూ.11,908 కోట్లు
6.జగనన్న విద్యా కానుక రూ.560 కోట్లు
7.పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధికి రూ.15,873 కోట్లు
8.పురపాలక పట్టణాభివృద్ధి రూ.9,381 కోట్లు
స్కిల్ డెవలప్మెంట్ రూ.1,166 కోట్లు
9.లా నేస్తం రూ.17 కోట్లు
10. .యువజన అభివృద్ధా, పర్యాటకం, సాంస్కృతి శాఖ రూ.1,291 కోట్లు
11.షెడ్యూలు కులాల కాంపొనెంట్ కోసం రూ.20,005 కోట్లు
12.వైఎస్ఆర్ కల్యాణ మస్తు రూ.200 కోట్లు
వైఎస్ఆర్ ఆసరా రూ.6,700 కోట్లు
13.షెడ్యూల్ తెగల కాంపొనెంట్ కోసం రూ.6,929 కోట్లు
14.వెనుకబడిన తరగతుల కాంపొనెంట్ కోసం రూ.38,605 కోట్లు
15.వైఎస్ఆర్ చేయూత రూ.5వేల కోట్లు
అమ్మ ఒడి రూ.6,500 కోట్లు
16.మొత్తంగా డీబీటీ స్కీంలకు రూ.54,228.36 కోట్లు
17.ధరల స్థిరీకరణ నిధి రూ.3 వేల కోట్లు
18.వ్యవసాయ యాంత్రీకరణ రూ.1,212 కోట్లు
19.వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం కోసం రూ.15,882 కోట్లు
20.కాపు సంక్షేమం రూ.4,887 కోట్లు
21.మైనార్టీల సంక్షేమం రూ.4,203 కోట్లు
22. పర్యావరణం , అటవీ, శాస్త్ర సాంకేతికత శాఖ రూ. 685 కోట్లు
23.ఎనర్జీ రూ.6,456 కోట్లు
24.గ్రామ , వార్డు సచివాలయాల శాఖకు రూ.3,858 కోట్లు
25.గడప గడపకు మన ప్రభుత్వం రూ.532 కోట్లు
Next Story