Mon Dec 23 2024 13:55:39 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ బడ్జెట్ 2,56,256 కోట్లు
ఏపీ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ 2.56,256 కోట్లుగా చూపారు
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ ఏడాది బడ్జెట్ 2.56,256 కోట్లుగా చూపారు. మూలధన వ్యయం 2,08,261 కోట్లగా బడ్జెట్ లో పొందుపర్చారు. మూలధన వ్యయం 47,996 కోట్లు అని బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి సభకు వివరించారు. రెవెన్యూలోటును 17,036 కోట్లుగా చూపారు.
పంచాయతీరాజ్ శాఖకు....
ద్రవ్యలోటు 48,724 కోట్లుగా బడ్జెట్ లో చూపించారు. వైఎస్సార్ పింఛను కానుక కింద బడ్జెట్ లో 18 వేల కోట్లను కేటాయించారు. వైఎస్సార్ రైతు భరోసా పథకానికి 3,900 కోట్లు కేటాయించారు. రోడ్లు భవనాల శాఖకు 8,581 కోట్లు, వైద్య శాఖకు 15,384 కోట్లు, పరిశ్రమల శాఖకు 2,755 కోట్లు, కార్మిక శాఖకు 790 కోట్లు, న్యాయశాఖ 924 కోట్లు, మున్సిపల్ శాఖకు 8,796 కోట్లు, మైనారిటీ శాఖకు 2,063 కోట్లు, పంచాయతీరాజ శాఖకు 15,084 కోట్లు, హౌసింగ్ కు 4,791 కోట్లు, ఇరిగేషన్ శాఖకు 11,482 కోట్లు కేటాయించారు.
సంక్షేమానికి....
సాంఘిక సంక్షేమానికి 12,728 కోట్లు, ఎస్సీ సబ్ ప్లాన్ కు 18,518 కోట్ు, బీసీ సబ్ ప్లాన్ కు 29,143 కోట్లు, ఈబీసీల సంక్షేమానికి 6,900 కోట్లు, జగనన్న వసతి దీవెనకు 2,093 కోట్లు, పౌరసరఫరాల శాఖకు 3,793 కోట్లు, వైఎస్సార్ కాపు నేస్తం పథకానికి 500 కోట్లు, పశుసంవర్థక శాఖకు 1,568 కోట్లు, పర్యావరణ, అటవీ శాఖకు 658 కోట్లు, విద్యుత్ శాఖకు 10,281కోట్లు, క్రీడాశాఖకు 290 కోట్లు, వైద్య ఆరోగ్య శాఖకు 15,381 కోట్లు కేటాయింపులు జరిపారు.
Next Story