Mon Dec 23 2024 15:57:39 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఏపీ మంత్రి వర్గ సమావేశం
ఏపీ మంత్రివర్గ సమావేశం ఈరోజు జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే సమావేశంలో 2022 -23 బడ్జెట్ ను ఆమోదిస్తారు
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈరోజు జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే సమావేశంలో 2022 -23 బడ్జెట్ ను ఆమోదిస్తారు. బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టే ముందే మంత్రి వర్గం ఆమోదించాల్సి ఉంటుంది. అందుకే ఏపీ మంత్రి వర్గ సమావేశాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కేవలం బడ్జెట్ ను ఆమోదించడం తప్ప మరో అజెండా లేకుండా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
బడ్జెట్ ఆమోదం కోసం....
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ ను నేడు శాసనసభలో ప్రవేశపెట్టనుంది. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉండటంతో బడ్జెట్ లో ఆ ప్రభావం ఉంటుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. దీనిని ఎన్నికల బడ్జెట్ గానే ప్రభుత్వం భావిస్తుందని చెబుతున్నారు. ఏఏ రంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నది కాసేపట్లో తేలనుంది.
Next Story