Mon Dec 23 2024 14:23:00 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఏపీ బడ్జెట్
2022 -23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ను నేడు బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి అసెంబ్టీలో ప్రవేశపెట్టనున్నారు
2022 -23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ను నేడు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి అసెంబ్టీలో ప్రవేశపెట్టనున్నారు. ఏపీ బడ్జెట్ సుమారు 2.50 లక్షల కోట్లు ఉండే అంచనాలు ఉన్నాయి. వచ్చే రెండేళ్లలు బడ్జెట్ లో సంక్షేమ పథకాలకే ప్రభుత్వం పెద్దపీట వేయనుంది. ఇప్పటికే ఆదాయంలో అధిక నిధులను ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు కేటాయిస్తుంది.
సంక్షేమ పథకాలకు....
ఈ ఏడాది కూడా సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్ రూపకల్పన చేసినట్లు తెలిసింది. దీంతో పాటు ప్రధానంగా ఏపీలో పెండింగ్ లో ఉన్న వివిధ సాగునీటి ప్రాజెక్టులకు కూడా భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల అభివృద్ధికి రెండు వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించనున్నారు. ఎన్నికలు ఇంకా రెండేళ్లు ఉన్నా ఏపీలో ఇప్పటికే ఎన్నికల వాతావరణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ బడ్జెట్ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story