Wed Mar 26 2025 04:03:02 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh Budget : 3.22కోట్లలో ఏపీ బడ్జెట్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3.22 లక్షల కోట్ల రూపాయల అంచనాతో బడ్జెట్ ను పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. రెవెన్యూ అంచనా వ్యయం 2,51,262 లక్షల కోట్లుగా చూపించారు.మూలధన వ్యయం అంచనా 40,635 కోట్ల రూపాయలుగా ఉంచారు. అమరావతి నిర్మాణానికి ఆరువేల కోట్ల రూపాయలు కేటాయించారు.రోడ్లు, రహదారుల నిర్మాణానికి 4,220 కోట్లు, పోర్టుల నిర్మాణానికి 605 కోట్లు, ఇంధన శాఖకు 13,600 కోట్లు, పాఠశాల విద్యాశాఖకు 31,806 కోట్ల రూపాయలు కేటాయించారు.
వ్యవసాయానికి అధికప్రాధాన్యత...
తమ ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. బీసీ సంక్షేమం కోసం 23,600 కోట్లు, వైద్య ఆరోగ్య శాఖకు 19, 635 కోట్ల రూపాయలను కేటాయించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులన్నా అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయనున్నామని తెలిపారు. ఐటీ ఎలక్ట్రానిక్స్ కు ఆరు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు పయ్యావుల తెలిపారు. మత్స్యకారులకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు కేటాయించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ద్రవ్యలోటు 79,926 రూపాయలుగా బడ్జెట్ లో చూపించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ విద్యాసంస్థలకు నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించామని తెలపిారు.
సంక్షేమానికిపెద్దపీట...
ఎస్.ఎస్, ఎస్.టి, బీసీ స్కాలర్ షిప్ ల కోసం 3,337 కోట్ల రూపాయలను బడ్జెట్ లో కేటాయించింది. స్వచ్ఛాంధ్ర కు 820 కోట్లు, దీపం 2 పథకం 2601 కోట్ల రూపాయలను కేటాయించింది. వ్యవసాయ శాఖలో ఆరు వేల కోట్ల రూపాయల బకాయీలను చెల్లించామని పయ్యావుల కేశవ్ తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. వ్యవసాయ శాఖకు 11,362 కోట్ల రూపాయలను కేటాయించినట్లు పయ్యావుల కేశవ్ తెలిపారు. ఆర్థికగా వెనకబడిన సంక్షేమానికి 10,619 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఎస్.సి, ఎస్టీ ఉచిత విద్యుత్తు కోసం నాలుగు వందల కోట్ల రూపాయలు కేటాయించింది. ఐటీ , ఎలక్ట్రానిక్స్ కు మూడు వందల కోట్ల రూపాయలు కేటాయించింది. తల్లికి వందనం విద్యాపథకాన్ని వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నట్లు పయ్యావుల కేశవ్ తెలిపారు.
Next Story