Sun Dec 14 2025 23:21:09 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
శాసనసభ నుంచి రెండో రోజు కూడా తెలుగుదేశం పార్టీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు.

శాసనసభ నుంచి రెండో రోజు కూడా తెలుగుదేశం పార్టీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. సమావేశాలు ప్రారంభమయిన వెంటనే తెలుగుదేశం పార్టీ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. ఒకరోజు సభ్యులను సభ నుంచి బహిష్కరిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
తమ్మినేని సీరియస్...
బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు సంయమనంతో వ్యవహరించాల్సిన విపక్షాలు నినాదాలు చేయడమేంటని తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. బడ్జెట్ సందర్భంగా నిరసన తెలిపే సంస్కృతిని తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు. బడ్జెట్ విన్న తర్వాత నిరసనలు తెలియజేయాలి తప్ప ప్రసంగం మొదలు పెట్టకముందే నిరసన తెలియజేయడం పట్ల తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story

