Sat Dec 21 2024 06:25:35 GMT+0000 (Coordinated Universal Time)
Ap Budget : గవర్నర్ గో బ్యాక్ అంటూ నినాదాలు
ఉభయ సభలను ఉద్దేశించి ఏపీ గవర్నర్ ప్రసంగిస్తుండగా టీడీపీ నేతలు పదే పదే అడ్డుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో గవర్నర్ బిశ్వభూషణ్ ప్రసంగం ప్రారంభమయింది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తుండగా టీడీపీ నేతలు పదే పదే అడ్డుకున్నారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభించిన వెంటనే టీడీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగంలో అన్నీ అబద్ధాలు అంటూ నినాదాలు చేశారు. గో బ్యాక్ అంటూ పెద్దయెత్తున నినదించారు. గవర్నర్ ప్రసంగం కాపీలను కూడా టీడీపీ సభ్యులు చించి వేశారు. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు.
అసహనంగా జగన్..
ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తుండగా టీడీపీ సభ్యులు అడ్డుకోవడం ప్రారంభించారు. టీడీపీ వ్యూహాత్మకంగానే గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవాలని నిర్ణయించుకున్నట్లుంది. గవర్నర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నప్పటికీ విశ్వభూషణ్ హరిచందన్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. చంద్రబాబు మినహా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభకు హాజరయ్యారు. టీడీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటుండటంతో ముఖ్యమంత్రి జగన్ అసహనంగా కన్పించారు.
Next Story