Mon Dec 23 2024 00:14:31 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు అరెస్ట్ : ఫ్లెక్సీల కలకలం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలో ఏర్పాటయిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలో ఏర్పాటయిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ఎన్టీఆర్ అభిమానులతో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. జగ్గయ్యపేట పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తెలుగుదేశం పార్టీ నేతలను కలవరపర్చేలా ఉన్నాయి.
థ్యాంక్యూ జగన్...
ఈ ఫ్లెక్సీలో "నా ఆత్మకు శాంతి చేకూర్చినందుకు జగన్ కు ధన్యవాదాలు" అంటూ జగ్గయ్యపేటలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఏర్పాటు చేశారు.ఎన్టీఆర్ జిల్లాలో ఎన్టీఆర్ ఫ్లెక్సీలో థ్యాంక్యూ జగన్ అంటూ ఎన్టీఆర్ పేరిట ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు కావడంతో టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది వైసీపీ నేతలు చేసిన పనేనంటూ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫ్లెక్సీపై ఎన్టీఆర్ సంతకాన్ని కూడా ఉంచారు.
ఆత్మశాంతి దినోత్సవంగా...
ఈ ఫ్లెక్సీలో "నా ఆత్మకు శాంతి చేకూర్చినందుకు జగన్ కు ధన్యవాదాలు" అంటూ సీనియర్ ఎన్టీఆర్ చెప్పినట్లు ముద్రించడంతో టీడీపీ శ్రేణులు నిరసనకు దిగాయి. ఆ ఫ్లెక్సీ అక్కడ ఎవరు ఏర్పాటు చేసిందీ తెలుసుకుని వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సెప్బంబరు 10వ తేదీన తెలుగు ప్రజలందరూ ఆత్మశాంతి దినోత్సవంగా జరుపుకోవాలంటూ కూడా ఫ్లెక్సీలో పేర్కొనడం వివాదంగా మారింది.
Next Story