Tue Nov 05 2024 14:56:47 GMT+0000 (Coordinated Universal Time)
బంద్ ఎలా జరిగిందంటే?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు నిరసనగా ఇచ్చిన బంద్ ఆశించిన స్థాయిలో జరగలేదు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు నిరసనగా ఇచ్చిన బంద్ ఆశించిన స్థాయిలో జరగలేదు. తెలుగుదేశం పార్టీ పిలుపు ఇచ్చిన బంద్ పిలుపునకు స్పందన అంతంత మాత్రంగానే కన్పించింది. దుకాణాలన్నీ ఎక్కడికక్కడ తెరుచుకున్నాయి. సోమవారం కావడంతో షాపులు మూసేయడానికి దుకాణాల యజమానులు ఎవరూ ఇష్టపడలేదు.
యధాతధంగా బస్సులు...
ఇక బంద్ ప్రభావం అనేక ప్రాంతాల్లో పెద్దగా కన్పించలేదు. ఆర్టీసీ బస్సులు కూడా యధాతధంగా తిరుగుతున్నాయి. ఉదయం నుంచే ఆర్టీసీ డిపోల నుంచి బస్సులు బయలుదేరి వెళ్లడంతో ప్రయాణికులు కూడా కొంత ఊరట చెందారు. తొలుత బంద్ ప్రభావం ఎక్కువగా కన్పించిన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ మధ్యాహ్నానికి పరిస్థితి యధాతధంగా మారింది.
నామమాత్రంగానే...
ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో అయితే బంద్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. విశాఖ నగరంతో పాటు అనేక చోట్ల సాధారణంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రయివేటు వాహనాలు సైతం మామూలుగానే తిరుగుతున్నాయి. పోలీసులు ప్రధాన కూడళ్లలో భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం, టీడీపీ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేయడంతో బంద్ ప్రభావం ఏపీలోని అనేక ప్రాంతాల్లో అంతగా కనిపించలేదు.
Next Story