Sat Dec 21 2024 14:35:43 GMT+0000 (Coordinated Universal Time)
జైలులో వాకింగ్.. యోగా
స్కిల్ డెవలెప్మెంట్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు జైలు జీవితానికి అలవాటుపడుతున్నారు
స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి ఆదివారం రాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లిన చంద్రబాబు కొద్దికొద్దిగా జైలు జీవితానికి అలవాటుపడుతున్నారు. తొలి రెండు రోజుల పాటు కొంత అసహనంగా కనిపించిన చంద్రబాబు ఈరోజు తెల్లవారు జామున నిద్రలేచి తన కార్యక్రమాలను ప్రారంభించినట్లు జైలు అధికారులు వెల్లడించారు.
ఎప్పటిలాగానే...
ఆయన తెల్లవారు జామున ఐదు గంటలకు లేచి జైలు ప్రాంగణంలో వాకింగ్ చేశారు. ఆయన వెంట ఐదుగురు భద్రత సిబ్బందితో ఆయన వాకింగ్ చేసినట్లు చెబుతున్నారు. దాదాపు అరగంట సేపు వాకింగ్ చేసిన తర్వాత చంద్రబాబు యోగా కూడా చేసి తర్వాత ఆయన తన గదిలోకి వెళ్లారని జైలు అధికారులు మీడియాకు తెలిపారు.
ములాఖత్...
తొలి రోజు కొంత అసహనంగా ఉన్న చంద్రబాబు ఈరోజు మాత్రం తెల్లవారు జామునే నిద్రలేచారు. రాత్రి కూడా తొందరగానే పడుకుని వేకువ జామున లేచి రోజువారీ తన కార్యక్రమాలను ప్రారంభించారు. యోగా చేసిన వెంటనే తన గదికి వచ్చిన వివిధ పత్రికలను ఆయన చదివారని అంటున్నారు. దీంతో పాటు బ్రేక్ ఫాస్ట్ కూడా ఎప్పటిలాగే ఉదయాన్నే చేసినట్లు, ఇంటి నుంచి తీసుకు వచ్చిన అల్పాహారాన్ని తిని చంద్రబాబు రెస్ట్ తీసుకుంటున్నట్లు సిబ్బంది తెలిపారు. ఈరోజు చంద్రబాబు కుటుంబ సభ్యులు ఆయనతో జైలులో ములాఖత్ కానున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు వారి ములాఖత్ ఖరారయింది. ఈరోజు చంద్రబాబు హౌస్ కస్టడీ పిటీషన్ పై తీర్పు వెలువడనుంది.
Next Story