Mon Dec 23 2024 18:37:13 GMT+0000 (Coordinated Universal Time)
కిటకిటలాడుతున్న కొండ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు చేరుకోవడంతో తిరుమల కొండలు గోవింద నామ స్మరణలతో మారుమోగుతున్నాయి. క్యూ లైన్ లో నిలబడి స్వామి వారి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి వేచి చూస్తున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి సెలవులతో సంబంధం లేదు. వారికి ఎప్పుడు స్వామి వారిని దర్శించుకోవాలనిపిస్తే అప్పుడే ఏడుకొండలకు రావడం ఆనవాయితీగా మారింది.
టీటీడీ ఏర్పాట్లు...
భక్తులు ఎంత మంది వచ్చినా తగిన ఏర్పాట్లు చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తులకు వసతితో పాటు అన్నప్రసాదాల విషయంలో కూడా ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటుంది. శ్రీవారి దర్శనానికి కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి రావడంతో తిరుమల భక్తులతో కిటకిట లాడుతుంది.
పద్దెనిమిది గంటలు...
ఈరోజు శ్రీవారి దర్శనం కోసం భక్తులు పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 66,199 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 29,351 మంది తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.17 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
Next Story