Fri Nov 29 2024 05:41:13 GMT+0000 (Coordinated Universal Time)
హౌస్ కస్టడీ పిటీషన్ తిరస్కరణ
చంద్రబాబుకు మరోసారి న్యాయస్థానంలో ఎదురుదెబ్బతగిలింది. న్యాయవాదులు వేసిన హౌస్ కస్టడీ పిటీషన్ ను కోర్టు కొట్టివేసింది
చంద్రబాబుకు మరోసారి న్యాయస్థానంలో ఎదురుదెబ్బతగిలింది. చంద్రబాబు తరుపున న్యాయవాదులు వేసిన హౌస్ కస్టడీ పిటీషన్ ను న్యాయసథానం కొట్టివేసింది. న్యాయస్థానం హౌస్ కస్టడీ పిటీషన్ న్యాయస్థానం కొట్టివేయడం టీడీపీ నేతలను నిరాశపర్చింది. చంద్రబాబుకు ప్రాణహాని ఉందన్న న్యాయవాదుల వాదనతో కోర్టు ఏకీభవించలేదు. అయితే ఇదే పరిస్థితుల్లో సీఐడీ వద్ద ఉన్న స్కిల్ డెవలెప్మెంట్ స్కాం కేసుకు సంబంధించిన పత్రాలను పరిశీలించేందుకు మాత్రం చంద్రబాబు న్యాయవాదులకు న్యాయస్థానం అనుమతిని న్యాయస్థానం మంజూరు చేసింది. హౌస్ కస్టడీకన్నా జైలు సేఫ్ అని న్యాయమూర్తి సైతం అభిప్రాయపడ్డారు.
భద్రత పటిష్టంగానే...
రాజమండ్రిలో హైసెక్యూరిటీ ఉంటుందన్న ప్రభుత్వం తరుపున న్యాయవాదుల వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. అవినీతి కేసుకు సంబంధించి హౌస్ కస్టడీకి అనుమతి ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రాణాలకు ఎటువంటి ముప్పు లేదని అన్నారు. సీఆర్పీసీలో రెండు కస్టడీలు మాత్రమే ఉన్నాయని పొన్నవోలు వాదించారు. చంద్రబాబుకు ఇంటి నుంచి భోజనంతో పాటు మందులు కూడా పంపుతున్నారని ఆయన తెలిపారు.
పత్రాల పరిశీలనకు...
చంద్రబాబు అనుమతి లేనిదే ఆ బ్లాక్ లోనికి వెళ్లేందుకు ఎవరికీ అనుమతి లేదని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు ఆరోగ్య పరిరక్షణకు ఎప్పుడూ వైద్యులు అందుబాటులో ఉంటారన్నారు. అందుకోసమే చంద్రబాబుకు హౌస్ కస్టడీ అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదని అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. చట్టపరంగా, న్యాయపరంగా నిందితులకు వర్తించే ప్రతి అంశం చంద్రబాబుకు వర్తిస్తుందని ఆయన తెలిపారు. అయితే కోర్టు అనుమతి ఇవ్వడంతో సీఐడీ వద్ద ఉన్న స్కిల్ డెవలెప్మెంట్ స్కాంకు సంబంధించిన పత్రాలను పరిశీలించే అవకాశం మాత్రం చంద్రబాబు తరుపున న్యాయవాదులకు లభించింది.
Next Story