Mon Dec 23 2024 11:47:01 GMT+0000 (Coordinated Universal Time)
రికార్డు స్థాయిలో ఆదాయం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం కూడా ఏమాత్రం రష్ తగ్గలేదు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం కూడా ఏమాత్రం రష్ తగ్గలేదు. భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకోవడంతో క్యూ లైన్లీ నిండుకున్నాయి. సాధారణంగా ఆగస్టు నెల తర్వాత తిరుమలకు అంత భక్తుల రష్ ఉండదు. విద్యార్థులకు పాఠశాలలు ఉండటం కారణంగా ఎవరూ తిరుమలకు వచ్చేందుకు ప్లాన్ చేసుకోరు. కానీ గత కొద్ది రోజులుగా మాత్రం తిరుమలలో ఉన్న రద్దీని చూస్తుంటే ఆ అభిప్రాయం తప్పని చెప్పక తప్పదు.
ఆన్లైన్ లో...
తిరుమలలో వసతి గదులు దొరక్క భక్తులు అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. అందుకోసం రద్దీని తగ్గించేందుకు ముందుగా ఆన్ లైన్ లో ప్రత్యేక దర్శనం టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేస్తుంది. ఆన్లైన్ లో బుక్ చేసుకున్న భక్తులే వస్తారని ఈ రకమైన విధానాన్ని ప్రవేశపెట్టినప్పటికీ రద్దీ మాత్రం తగ్గడం లేదు.
18 గంటలు...
ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 23 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. వీరికి దర్శన సమయం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 70,055 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 27,742 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నినన తిరుమల శ్రీవారి ఆదాయం రికార్డు స్థాయిలో 5.32 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ మధ్య కాలంలో రోజులో ఐదు కోట్ల రూపాయల హుండీ ఆదాయం రావడం తొలిసారి అని అధికారులు తెలిపారు.
Next Story