Mon Dec 23 2024 11:47:00 GMT+0000 (Coordinated Universal Time)
కీలక విచారణ... టెన్షన్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కేసుకు సంబంధించి మూడు కేసులు న్యాయస్థానాల్లో విచారణకు రానున్నాయి.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కేసుకు సంబంధించి మూడు కేసులు న్యాయస్థానాల్లో విచారణకు రానున్నాయి. ఇటు ఏసీబీ న్యాయస్థానంలోనూ అటు హైకోర్టులోనూ మూడు కేసుల విచారణ జరగనుంది. దీనిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబును స్కిల్ డెవలెప్మెంట్ స్కాం కేసులో మరింత లోతుగా విచారించాలని ఐదు రోజుల పాటు సీఐడీ కస్టడీ కోరింది. దీనిపై నేడు విచారణ జరగనుంది.
హైకోర్టులోనూ...
అదే సమయంలో రాజకీయ ప్రేరేపిత కేసు అని, చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలయింది. తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటీషన్ ను చంద్రబాబు వేశారు. ఈరోజు క్వాష్ పిటీషన్ పై విచారణ జరగనుంది. అలాగే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు పిటీషన్ దాఖలు చేశారు. దీనిపైన కూడా నేడు విచారణ జరగనుంది. ఇప్పటికే నాలుగు రోజుల నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుకు ఈరోజు ఊరట కలుగుతుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
Next Story