Mon Dec 23 2024 07:20:36 GMT+0000 (Coordinated Universal Time)
అరెస్ట్ చేస్తే ఇంత రాద్ధాంతమా? : సజ్జల
టీడీపీ అధినేత చంద్రబాబు దేశంలో ఉండే చట్టాలకు అతీతుడా? ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అని ప్రశ్నించారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దేశంలో ఉండే చట్టాలకు అతీతుడా? ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అని ప్రశ్నించారు. అరెస్ట్ అయ్యాక ఎవరికీ ఇవ్వని సౌకర్యాలు ఆయనకు కల్పించారన్నారు. దొంగను అరెస్ట్ చేస్తే మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లు గగ్గోలు పెట్టడం ఎంతమాత్రం సబబని ఆయన ఆయన అన్నారు. చంద్రబాబు జైలులో ఉండటమే తప్పు అన్నట్లు మాట్లాడుతున్నారన్నారు. ఇంట్లో ఉంచేదానికి అరెస్ట్ చేయడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. 2014లో స్కిల్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసిన చంద్రబాబు గంటా సుబ్బారావును ఎండీగా నియమించారన్నారు.
సానుభూతి కోసం...
2015 ఫిబ్రవరిలో స్కిల్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ గా మార్చారన్నారు.చిన్న కార్పొరేషన్ ఎండీకి ఎందుకు లింక్ చేశారన్నారు.యువత పేరు చెప్పి కోట్లు దోచుకున్నారన్న ఆయన గోబెల్స్ ప్రచారం చేస్తే తప్పులు ఒప్పులు కావని ఆయన అభిప్రాయపడ్డారు. సానుభూతి కోసం పాకులాడుతున్నారన్న సజ్జల 2019 ఏప్రిల్ లోనే సీమెన్స్ కంపెనీ ఇన్విస్టిగేషన్ రిపోర్టు ఇచ్చిందన్నారు. ఏమీ లేని దానికి ఎందుకు అరెస్ట్ చేస్తారన్నారు. వ్యవస్థలను ఇన్నాళ్లూ మేనేజ్ చేసుకుంటూ వచ్చిన ఆయన ఎవరు ఏమి చేస్తారన్న ఆత్మవిశ్వాసంతో ఉన్నారన్నారు సజ్జల. ఇందులో సీరియస్ క్రైమ్ జరిగిందన్నారు. దోచుకోవడానికే ఈ స్కీమ్ ను పెట్టారన్నారు.
రాజకీయ కోణం లేదు...
చంద్రబాబు అరెస్ట్ లో ఎటువంటి రాజకీయ కోణం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. 371 కోట్ల ప్రజాధనాన్ని నేరుగా పంపి దానిని షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబుకు చేరడాన్ని ఎవరు సమర్థిస్తారని ఆయన నిలదీశారు. విచారణలో కూడా చంద్రబాబు సహకరించకపోవడం అందువల్లనేనని సజ్జల అభిప్రాయపడ్డారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా నేరం జరిగిందని తెలిపాయన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కేసులో అన్నీ ప్రశ్నలకు సమాధానాలున్నాయని ఆయన అన్నారు. చంద్రబాబు అరెస్ట్ లో ఎలాంటి తప్పు జరగలేదన్నారు. అవినీతి జరగబట్టే ఆయనను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
Next Story