Fri Nov 15 2024 15:45:27 GMT+0000 (Coordinated Universal Time)
నిబంధనలకు విరుద్ధంగానే : సీఐడీ చీఫ్ సంజయ్
స్కిల్ డెవలెప్మెంట్ స్కీమ్ లో స్కామ్ జరిగిన మాట వాస్తవమేనని సీఐడీ చీఫ్ సంజయ్ అన్నారు.
స్కిల్ డెవలెప్మెంట్ స్కీమ్ లో స్కామ్ జరిగిన మాట వాస్తవమేనని సీఐడీ చీఫ్ సంజయ్ అన్నారు. మంత్రివర్గం ఆమోదం లేకుండానే స్కిల్ డెవలెప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేశారన్నారు. సంజయ్ మీడియా సమావేశంలో ఈ కార్పొరేషన్ కు సంబంధించి పలు అంశాలను వెల్లడించారు. ఎంఓయూకు విరుద్ధంగా జీవో విడుదలయిందని సంజయ్ తెలిపారు. అగ్రిమెంటులోనూ దురుద్దేశం ఏంటో స్పష్టంగా కనిపిస్తుందన్న సంజయ్ ప్రయివేటు వ్యక్తి గంటా సుబ్బారావును నియమించారన్నారు. కార్పొరేషన్ ఏర్పాటులో ఎటువంటి విధివిధానాలను పాటించలేదని సంజయ్ తెలిపారు.
13 చోట్ల సంతకాలు...
ఆరు చోట్ల కస్టర్లు పెట్టాలనుకున్నారు కాని ఎక్కడా పెట్టలేదని సంజయ్ తెలిపారు. 313 కోట్లలో 241 కోట్లు ఒక షెల్ కంపెనీ ద్వారా చేతులు మారాయని ఆయన స్పష్టం చేశఆరు. స్కిల్ సెంటర్లు ఎక్కడ పెట్టాలని తేల్చకముందే జీవోను విడుదల చేశారన్న సంజయ్ ఈడీ 32 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేసిందని గుర్తు చేశారు. పదమూడు చోట్ల చంద్రబాబు సంతకాలు ఉన్నాయని ఆయన తెలిపారు. నేరుగా కంపెనీలు చంద్రబాబుతో మాట్లాడేలా ప్లాన్ చేశారన్నారు. డిజైన్ టెక్ ఎండీ ఖన్వేల్కర్ రెండు నెలల పాటు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారని ఆయన గుర్తు చేశారు.
షెల్ కంపెనీ ద్వారా...
బడ్జెట్ అప్రూవ్ చేసే పత్రంపైన కూడా చంద్రబాబు సంతకం ఉందని సంజయ్ మీడియాకు వివరించారు. ప్రభుత్వ సొమ్ము చేతులు మారిందనడానికి ఆధారాలున్నాయన్నారు. ఎక్కడా గ్రాంట్ ఎయిడ్ పెడతామని చెప్పలేదన్న సంజయ్ సీమెన్స్ ను తెచ్చి స్కిల్ డెవలెప్ సెంటర్లు పెట్టాలని ఎంఓయూలో లేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇదంతా జరగడానికి ఎవరి ప్రోద్బలం కారణమన్న దానిపై లోతుగా విచారించిన తర్వాతనే కేసు నమోదు చేసినట్లు సీఐడీ చీఫ్ సంజయ్ తెలిపారు.
Next Story