Mon Dec 23 2024 06:56:36 GMT+0000 (Coordinated Universal Time)
రేపు విజయనగరానికి జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. విజయనగరంలోని వైద్య కళాశాలకు ఆయన వెళతారు. దానితో పాటు రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కళాశాలలను వర్చువల్ గా జగన్ ప్రారంభించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
బాబు అరెస్ట్ పై...
ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరి జగన్ పది గంటల ప్రాంతంలో విజయనగరానికి చేరుకుంటారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అక్కడ మెడికల్ కళశాలలను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత తిరిగి తాడేపల్లికి బయలుదేరి వస్తారు. జగన్ పర్యటనతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చంద్రబాబు అరెస్ట్ తో టీడీపీ, జనసేన నేతలు ఎటువంటి నిరసనలు తెలపకుండా ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ చంద్రబాబు అరెస్ట్ పై ఏం మాట్లాడతారన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story