Mon Dec 23 2024 07:43:40 GMT+0000 (Coordinated Universal Time)
20న ఏపీ కేబినెట్ మీట్
ఈ నెల 20న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయించింది
ఈ నెల 20న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయించింది. అజెండా ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ముఖ్యమైన బిల్లులను ఆమోదించడంతో పాటు ముఖ్య నిర్ణయాలను అమలు చేసే విషయాన్ని సమావేశంలో జగన్ మంత్రులకు వివరించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
బాబు అరెస్ట్...
దీంతో పాటు ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశముంది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని నిర్వహించాలి? ఏ బిల్లులు పెట్టాలన్న దానిపై చర్చించనున్నారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత చంద్రబాబు అరెస్ట్ తదనంతర పరిణామాలపై కూడా మంత్రులతో జగన్ చర్చించనున్నారని చెబుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో కొందరు మంత్రులు విఫలమయ్యారని కూడా జగన్ అభిప్రాయపడుతున్న నేపథ్యంలో ఈ మంత్రివర్గ సమావేశం కీలకంగా మారనుంది.
Next Story