ఏపీలో భారీగా గంజాయి పట్టివేత
తెలుగు రాష్ట్రాల్లో గంజాయా ఏరులైపారుతోంది. గుట్టుప్పుడు కాకుండా నిర్వహిస్తున్నగంజాయి దందాను పోలీసులు గుట్టురట్టు..
తెలుగు రాష్ట్రాల్లో గంజాయా ఏరులైపారుతోంది. గుట్టుప్పుడు కాకుండా నిర్వహిస్తున్నగంజాయి దందాను పోలీసులు గుట్టురట్టు చేస్తున్నారు. తాజాగా విశాఖ అల్లూరి ఏజెన్సీలో రూ.3 కోట్ల రూపాయల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి గంజాయితోపాటు లక్ష రూపాయల నదు, వాహనాన్ని సీజ్ చేశారు. అయితే స్మగ్లర్లలో ఇద్దరు పారిపోగా, వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. చింతపల్లి మండలం కుడుమసారి పంచాయతీ నిమ్మపాడు గ్రామం వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా బైక్ పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయారు. అదే సమయంలో బొలెరో వాహనం దూకి మరొకరు పారిపోయారు. అప్రమత్తమైన పోలీసులు బొలెరో డ్రైవర్ను పట్టుకుని వాహనాన్ని తనిఖీ చేశారు. వాహనంలో 34 బస్తాల గంజాయి పట్టుబడింది. మొత్తం 1400 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించారు పోలీసులు.
ఈ గంజాయి విలువ మార్కెట్లో 3 కోట్ల రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఒరిస్సా దగుడుపల్లి నుండి ఈ గంజాయిని తరలిస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. గంజాయిని తీసుకొని నర్సీపట్నం వైపు వెళ్ళటానికి ప్లాన్ చేశారు స్మగ్లర్లు. డ్రైవర్ ప్రసాద్, సీందరి చిన్నయ్య అనే ఇద్దరిని అరెస్టు చేశారు పోలీసులు. వీరి వద్ద నుంచి రెండు సెల్ ఫోన్లు, లక్ష రూపాయల నగదును, బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
కోరుకొండకు లోతుగెడ్డ బ్రిడ్జి దగ్గర గంజాయి రవాణా జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం మధ్యాహ్నం వాహనాల తనిఖీలు నిర్వహించారు. పోలీసుల ఉనికిని గమనించిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు.. బైక్పై వచ్చి అక్కడినుంచి పరారయ్యారు. వీరిద్దరూ పైలట్లుగా వ్యవహరిస్తున్నారు.. తదనంతరం, ఒక బొలెరో వాహనం ఆ ప్రదేశానికి చేరుకోగా.. పోలీసులను చూసి డ్రైవర్ తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ అప్పటికే చుట్టుముట్టిన పోలీసులు అతన్ని పట్టుకున్నారు. అల్లూరి జిల్లా చింతపల్లి మండలం బలపం పంచాయతీలోని రాళ్లగెడ్డకు చెందిన సిందేరి చిన్నయ్య, కొత్తపాలెం పంచాయతీ భీమసింగి గ్రామానికి చెందిన కుడా ప్రసాద్ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.