Sun Jan 12 2025 12:05:39 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో భారీగా ఐపీఎస్ ల బదిలీ.. ఏసీబీ డీఐజీ గా రామకృష్ణ
విజయవాడ ఎస్పీ విశాల్ గున్నికి అదనంగా విజయవాడ రైల్వే ఎస్పీ బాధ్యతలను అప్పగించింది. కాకినాడ జిల్లా ఎస్పీగా ఉన్న రవీంద్రనాథ్
అమరావతి : ఏపీలో భారీగా ఐపీఎస్ ల బదిలీలు జరిగాయి. మొత్తం 17 మంది ఐపీఎస్ ల పోస్టింగ్ లలో మార్పులు చేర్పులు చేస్తూ.. కొందరికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ఏసీబీ డీఐజీగా పిహెచ్ డీ రామకృష్ణను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐజీపీ క్రీడలు, సంక్షేమంతో పాటు రైల్వే ఏడీజీగా ఎల్ కేవీ రంగారావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎస్వీ రాజశేఖర్ బాబును డీఐజీగా బదిలీ చేస్తూనే.. శాంతి భద్రతలు డీఐజీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఏసీబీ డీఐజీగా నియమించిన రామకృష్ణకు అదనంగా టెక్నికల్ సర్వీసెస్ డీఐజీ బాధ్యతలను అప్పగించింది.
కేవీ మోహన్ రావు ను పోలీసు శిక్షణ వ్యవహారాల డీఐజీగా బదిలీ చేసింది. ఎస్ హరికృష్ణను కోస్టల్ సెక్యూరిటీ డీఐజీగా అదనపు బాధ్యతలు కట్టబెటటింది. గోపీనాథ్ జెట్టి ని గ్రే హౌండ్స్ డీఐజీగా బదిలీ చేస్తూ.. అదనంగా న్యాయవ్యవహారాల ఐజీపీ బాధ్యతలు ఇచ్చింది. 16 బెటాలియన్ కమాండెంట్ గా కోయ ప్రవీణ్ ను బదిలీ చేసింది. విజయవాడ ఎస్పీ విశాల్ గున్నికి అదనంగా విజయవాడ రైల్వే ఎస్పీ బాధ్యతలను అప్పగించింది. కాకినాడ జిల్లా ఎస్పీగా ఉన్న రవీంద్రనాథ్ బాబుకు ఏపీఎస్పీ 3 బెటాలియన్ కమాండెంట్ గా అదనపు బాధ్యతలు ఇచ్చింది.
అజితా వేజేండ్లకు గుంతకల్ రైల్వే ఎస్పీగా అదనపు బాధ్యతలు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. పి అనిల్ బాబును పోలీసు హెడ్ క్వార్టర్స్ కు బదిలీ చేసింది. జి.కృష్ణకాంత్ ను రంపచోడవరం అదనపు ఎస్పీ ఆపరేషన్స్ గా, పి.జగదీశ్ ను చిత్తూరు జిల్లా అదనపు అడ్మిన్ ఎస్పీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. పాడేరు అదనపు ఎస్పీ అడ్మిన్ గా తుహిన్ సిన్హా, పలనాడు జిల్లా అదనపు అడ్మిన్ ఎస్పీగా బిందుబాధవ్, విజిలెన్సు , ఎన్ ఫోర్సుమెంట్ ఎస్పీగా పీవీ రవికుమార్ ను బదిలీ చేసింది ప్రభుత్వం. డీఎన్ మహేష్ ను పోలీసు హెడ్ క్వార్టర్స్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Next Story