Thu Dec 19 2024 22:40:57 GMT+0000 (Coordinated Universal Time)
కృష్ణాజిల్లాలో విషాదం.. బావిలో పూడికతీస్తూ నలుగురి మృతి
బావిలో పేరుకున్న మటిని పూడిక తీసేందుకు వెళ్లిన నలుగురు ఒకరి తర్వాత ఒకరు విగతజీవులయ్యారు. జిల్లాలోని పెడన నియోజకవర్గం..
ఏపీలోని కృష్ణాజిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. బావిలో పేరుకున్న మటిని పూడిక తీసేందుకు వెళ్లిన నలుగురు ఒకరి తర్వాత ఒకరు విగతజీవులయ్యారు. జిల్లాలోని పెడన నియోజకవర్గం బంటుమిల్లి గ్రామంలో జరిగింది. వీరిలో ఒకరు ఇంటి యజమాని కాగా, ఇద్దరు బంటుమిల్లి బిఎన్ఆర్ కాలనీకి చెందిన తండ్రి కొడుకులు, మరొకరు ములపర్రు గ్రామానికి చెందిన వ్యక్తి అని స్థానికులు తెలిపారు. మృతులు రామారావు, లక్ష్మణరావు, శ్రీనివాసరావు, రంగాగా గుర్తించారు.
బావిలో పూడిక మట్టి తీసేందుకు వెళ్లిన నలుగురు.. లోపలున్న ఊబిలో కూరుకుపోవడం వల్ల మృతిచెందినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఒకరి తర్వాత ఒకరు ఊబిలో కూరుకుపోయి మృతి చెందినట్లు తెలిపారు. ఒకేసారి నలుగురి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story