Sun Dec 14 2025 18:17:31 GMT+0000 (Coordinated Universal Time)
నేడు రైతుల పాదయాత్రకు బ్రేక్
అమరావతి రైతుల మహా పాదయాత్రకు నేడు విరామం ప్రకటించారు. రేపు తిరిగి పాదయాత్ర ప్రారంభం కానుంది

అమరావతి రైతుల మహా పాదయాత్రకు నేడు విరామం ప్రకటించారు. రేపు తిరిగి పాదయాత్ర ప్రారంభం కానుంది. పదిహేను రోజులుగా అమరావతి రైతుల పాదయాత్ర కొనసాగుతుంది. ఏలూరు జిల్లా లో ప్రస్తుతం పాదయాత్ర కొనసాగుతోంది. పదహారో రోజు కొత్తూరు నుంచి బయలుదేరి ఏలూరు, పాలెగూడె, కొప్పలి వరకూ ఈ పాదయాత్ర కొనసాగుతుందని నిర్వాహకులు వెల్లడించారు.
అడుగడుగునా...
పాదయాత్రకు అడుగడుగునా ఘన స్వాగతం లభిస్తుంది. ప్రధానంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు పాదయాత్రకు స్వాగతం పలుకుతూ వారికి సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు. ఈ నెల 12వ తేదీన అమరావతి నుంచి పాదయాత్ర ప్రారంభమయింది. అరసవిల్లి వరకూ అరవై రోజుల పాటు సాగనుంది.
Next Story

