Mon Dec 23 2024 11:22:12 GMT+0000 (Coordinated Universal Time)
అశోక్ గజపతిపై కేసు నమోదు
మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుపై కేసు నమోదయింది. విజయనగరం జిల్లా పోలీసులు ఆయనతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు
మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుపై కేసు నమోదయింది. విజయనగరం జిల్లా పోలీసులు ఆయనతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. నిన్న రామతీర్ధం ఆలయంలో జరిగిన ఘటనపై ఈ కేసు నమోదు చేశారు. అశోక్ గజపతి రాజు ఆలయంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడంతో పాటు మంత్రులతో వాగ్వాదానికి దిగడాన్ని కూడాపోలీసులు తప్పుపడుతుననారు.
విధులకు ఆటంకం....
473, 353 సెక్షన్ ల కింద పోలీసులు కేసు నమోదు చేశఆరు. తమ విధులకు ఆటంకం కలిగించారంటూ ఈవో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తాము ఆధ్మాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రామతీర్థం వెళ్లామని, అక్కడ అధికారిక కార్యక్రమాలు కావని అశోక్ గజపతరాజు స్పష్టం చేశారు.
Next Story