Mon Dec 23 2024 08:28:33 GMT+0000 (Coordinated Universal Time)
సుప్రీంకోర్టుకు సునీత.. ఎందుకంటే?
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయన కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరగాలని ఆమె కోరారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ విచారణ చేస్తుంది. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
సీబీఐ దర్యాప్తులో...
కానీ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలంటూ వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత పిటీషన్ వేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రతివాదులుగా చేర్చారు. సీబీఐ విచారణలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో, నిందితులే దర్యాప్తు అధికారులపై కేసులు పెడుతున్నారని సునీత తాను వేసిన పిటీషన్ లో పేర్కొన్నారు. అందుకే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
Next Story